Friday, July 5, 2024
HomeతెలంగాణKorukanti Chander: కేసీఆర్‌ హ్యట్రిక్ సీఎం కావాలి

Korukanti Chander: కేసీఆర్‌ హ్యట్రిక్ సీఎం కావాలి

సీ.ఎం కే.సీ.ఆర్ సంక్షేమ పధకాలతో తో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం దశాబ్ది ప్రగతి ప్రజా చైతన్యా యాత్ర కార్పొరేషన్ పరిధిలోని 36వ డివిజన్లోని పలు వీధుల గుండా కొనసాగింది. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇంటింటికి తిరుగుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్ సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడు ప్రజలు కష్టాలు పట్టించుకోలేదన్నారు.
సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతమంతా బీడు భూములయ్యాయని తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితులు ఎదురయ్యాయన్నారు. పేదల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని అన్నారు.

- Advertisement -

ఆసరా పెన్షన్ తో ఆర్ధిక భరోసాను కల్పిస్తూ కుటుంబ పెద్దకొడుకుగా సీఎం కెసిఆర్ నిలుస్తున్నారని అన్నారు. ఉచితంగా 24 గంటల కరెంటుతో రైతన్నల జీవితాలు సస్యశ్యామలంగా వృద్ధి చెందుతున్నాయని అన్నారు. రైతు సంక్షేమం కోసం రైతుబంధు రైతు బీమా లాంటి పథకాలను అమలు చేస్తూ రైతు బాంధవుడుగా కెసిఆర్ చరిత్రలో నిలిచారని అన్నారు. రైతే రాజుగా వర్ధిల్లాలని అంటూ.. దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్నానని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న గొప్ప పాలనకు ఆకర్షితులైన దేశ ప్రజలు సీఎం కేసీఆర్ పాలనను ఆహ్వానిస్తున్నారని అన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండింటిని సమపాళ్లలో అమలు చేస్తూన్న గొప్ప నేత కేసిఆర్ ఆని అన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దొంత శ్రీనివాస్, కుమ్మరి శ్రీనివాస్, కల్వచర్ల కృష్ణవేణి, జనగామ కవితా సరోజిని, నాయకులు మెతుకు దేవరాజ్, అచ్చ వేణు, పిల్లి రమేష్, మేడి సదానందం, చెలుకలపల్లి శ్రీనివాస్, కలువల సంజీవ్, సంధ్యారెడ్డి, దాసరి శ్రీనివాస్, అక్షర మల్లేష్, అల్లం ఐలయ్య యాదవ్, హఫీజ్, కోడి రామకృష్ణ, చిట్టవేని వేణు, మేకల అబ్బాస్, ఇరుగురాల శ్రావణ్, చింటూ, పిడుగు కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News