బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆయన చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన రాజకీయాలకు బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే కొద్దిరోజులు మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు.
ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోడానికి రోజువారీ కార్యక్రమాలకి బ్రేక్ ఇచ్చి వెల్ నెస్ రీ ట్రీట్ కోసం సమయాన్ని కేటాయించబోతున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. ఈ సమయంలో “నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ఎక్కువగా మిస్ అవరని ఆశిస్తున్నాను” అంటూ ఆయన ట్వీట్ కి ఓ సెటైర్ కూడా జోడించారు కేటీఆర్.
కాగా, అధికారం కోల్పోయి బీఆర్ఎస్ ప్రతిపక్ష స్థానంలోకి వచ్చినప్పటి నుంచి కేటీఆర్ (KTR) బిజీ లైఫ్ నే గడుపుతున్నారు. తండ్రి అనారోగ్యం, చెల్లెలి జైలు జీవితం, పార్టీ నేతల అరెస్టులు, ధర్నాలు ఇలా మానసికంగా, శారీరకంగా ఆయనపైనే ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉందని చెప్పాలి. దీంతో వీటన్నిటి నుంచి కోలుకుని, రిఫ్రెష్ అవడానికి ఆయన తన మానసిక ప్రశాంతత కోసం, శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేక సమయాన్ని గడపాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.