Friday, September 20, 2024
HomeతెలంగాణManchiryala: నకిలీ విత్తన విక్రేతలకు కౌన్సిలింగ్

Manchiryala: నకిలీ విత్తన విక్రేతలకు కౌన్సిలింగ్

గతంలో నకిలీ విత్తనాలు అమ్మిన, అక్రమ రవాణా చేసిన వారికి ముందస్తుగా మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ కౌన్సిలింగ్ ఇచ్చి, రైతులను మోసగించినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి, ఐపిఎస్. (డీఐజీ) ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్, బెల్లంపల్లి సబ్ డివిజన్ అన్ని పోలీస్ స్టేషన్ లపరిధిలో గతంలో నకిలీ విత్తనాలను అక్రమ రవాణా చేస్తూ పట్టుబడినటువంటి 96 మంది నిందితులను అందర్నీ పిలిపించి మంచిర్యాల డిసిపి కార్యాలయంలో డిసిపి సుధీర్ రాంనాథ్ కేకన్, ఐపీఎస్., పోలీస్ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ… నకిలీ విత్తనాలు విక్రయించి రైతులను మోసగించినట్లయితే వారిపై తప్పకుండ పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపీ అంజని కుమార్, రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల జోన్ పరిధిలో నకిలీ విత్తనాల విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వానాకాలం సాగును దృష్టిలో ఉంచుకొని రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకొంటున్నట్లు సిపి, సంబంధిత శాఖల అధికారులు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లాలో నకిలీ విత్తనాల సరఫరా, ఉత్పత్తి, అమ్మకాలను అరికట్టడానికి వ్యవసాయ, పోలీస్ శాఖ సంయుక్తంగా మండల స్థాయిలో ప్రత్యేక స్పెషల్ టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీస్ టీమ్స్ ఎప్పటికప్పుడు తనిఖీలు, అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఎవరైన వ్యాపారులు, సంస్థలు, వ్యక్తులు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే స్థానిక పోలీస్ అధికరులకు గానీ, డయల్ 100 నంబర్ కు గానీ సమాచారం అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి, బెల్లంపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీష్, మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, అగ్రికల్చర్ అధికారులు, సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, పోలీస్, వ్యవసాయ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News