Sunday, November 16, 2025
HomeతెలంగాణMLA Satish: మైనారిటీ బంధు అందించిన ఎమ్మెల్యే

MLA Satish: మైనారిటీ బంధు అందించిన ఎమ్మెల్యే

అర్హులకు దళితబంధు, బీసీబంధు మైనారిటీ బంధు

తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దేశంలో ఏ రాష్ట్రములో అమలు చేయనటువంటి పథకాలను అమలు చేస్తూ.. ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. దళితబంధు, బీసీబంధు మైనారిటీబంధు వివిధ సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి అందుతున్నాయని, అందరూ వాటిని వినియోగించుకొని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన ఎండి గౌస్ కు మైనారిటీ బంధు చెక్కును ఎమ్మెల్యే అందించారు. బీసీబంధు, మైనారిటీ బంధు ద్వారా ఎలాంటి బ్యాంకు లింకేజ్ లేకుండా ఒక లక్ష రూపాయలను లబ్ధిదారులకు అందించడం సీఎం కేసీఆర్ తీసుకున్న చారిత్రాత్మకమైన చర్య అని కొనియాడారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad