Thursday, December 19, 2024
Homeచిత్ర ప్రభMohan Babu: తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్

Mohan Babu: తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్

కుటుంబ వివాదం నేపథ్యంలో జల్‌పల్లిలోని నివాసం వద్దకు వెళ్లిన జర్నలిస్ట్‌పై దాడి ఘటనలో నటుడు మోహన్ బాబుపై పహాడీ షరీఫ్‌ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ హైకోర్టు(TG High Court)లో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో ఆయన కోరారు. దీంతో కోర్టు విచారణపై ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -

కాగా మోహన్‌బాబు (Mohan Babu) నివాసం వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. మనోజ్ దంపతులో పాటు నివాసంలోకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్రమంలో ఓ జర్నలిస్టుపై దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టికే మోహ‌న్ బాబుపై పోలీసులు హ‌త్యాయ‌త్నం కేసు కూడా న‌మోదు చేసిన విషయం విధితమే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News