మంచిర్యాల పట్టణంలో ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు 60 లక్షల మున్సిపాలిటీ నిధులతో రామ్ నగర్ 20 వార్డు అభివృద్ధిలో భాగంగా శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పట్టణంలో ప్రతి వార్డులో అభివృద్ధి పనులను చేపడుతున్నామని చెప్పారు, అభివృద్ధిని చూసి ప్రజలు తమకు ఓట్లు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు కొందరు వ్యక్తులు అలజడి సృష్టించే పనులు చేస్తున్నారని అటువంటి వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పి తీరుతారని పరోక్షంగా పేర్కొన్నారు. అనంతరం మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య మాట్లాడుతూ… మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ రోడ్లు డ్రైన్లు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను తీర్చనున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అప్పటికప్పుడే విద్యుత్ అధికారులను పిలిచి విద్యుత్ విషయంలో ఏర్పడుతున్న సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ వార్డులోని కౌన్సిలర్లు, వార్డు సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 20వార్డు కౌన్సిలర్ అంకం నరేష్, మాజీ కౌన్సిలర్ అంకం మనోజ్, రవీందర్రావు, శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు గదే సత్యం, వార్డు అధ్యక్షుడు కొట్టే రవి, కొట్టే సత్యం, సురేష్ గౌండ్, మాజీ కౌన్సిలర్ గంగులు, వెంకటేశ్వర్లు గౌడ్, అనంతుల మోహన్, మల్లికార్జున్ పలువురు పాల్గొన్నారు.