లగచర్ల ఘటన కేసులో అరెస్ట్ అయిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నరేందర్‌రెడ్డితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 24 మంది రైతులకూ బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఆయన ఏ1 నిందితుడిగా ఉన్నారు.
- Advertisement -
కాగా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి వెనక పట్నం నరేందర్ రెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తూ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దాదాపు 40 రోజులకు పైగా ఆయన జైలు జీవితం గడుపుతున్నారు. తాజాగా కోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదల కానున్నారు.