ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు అగ్నిప్రమాదంలో గాయలైన సంగతి తెలిసిందే. సింగపూర్‌లోని ఓ స్కూల్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అంతేకాకుండా చిన్నారి ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ ఈ విషయం తెలుసుకుని కాసేపట్లో సింగపూర్ వెళ్లనున్నారు.
ఇదిలా ఉంటే పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలని అభిమానులు, ప్రముఖులు ప్రార్థిస్తున్నారు. ఈమేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. “సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు తెలుసుకుని దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని ట్వీట్ చేశారు.