హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని.. ఏపీ రాజధాని అమరావతికి పెట్టుబడులు వెళ్తున్నాయనే ప్రచారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) స్పందించారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్ చాట్‌లో పొంగులేటి మాట్లాడుతూ చంద్రబాబు(Chandrababu) ఏపీ సీఎం అయ్యాక అమరావతికి పెట్టుబడులు పెరుగుతున్నాయనేది ప్రచారం మాత్రమే అన్నారు. ఇటీవల విజయవాడలో వచ్చిన వరదలతో అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. పెట్టుబడిదారులు అమరావతి కంటే హైదరాబాద్, బెంగళూరుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని తెలిపారు. హైడ్రాపై తొలుత తప్పుడు ప్రచారం జరిగినా ఇప్పుడు ప్రజలకు నిజం తెలిసిందన్నారు.
ఇక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తే.. ఆయనతో కూర్చొని మాట్లాడాలనే కోరిక ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఏడాది కాలంపై ఎలాంటి వ్యతిరేకత లేదని.. గతంలో వైఎస్ఆర్(YSR) సమయంలో కూడా ఇలానే ప్రచారం జరిగిందని గుర్తుచేశారు. మరో రెండు మూడు ఏళ్ళల్లో అన్ని సర్దుకుంటాయని వివరించారు.