పేదలకిచ్చే రేషన్ బియ్యాన్ని రైస్ మిల్లులో నిల్వ ఉంచారన్న విశ్వాసనీయ సమాచారం తో సివిల్ సప్లై అధికారులు ఉమ్మడి మహబూబ్ నగర్ లో దాడులు నిర్వహించి పట్టుకున్నారు. కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామ శివారులో ఉన్న సింహాద్రి రైస్ ఇండస్ట్రీలో రి సైక్లింగ్ చేయగా మిగిలిన దాదాపు 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించిన సివిల్ సప్లై అధికారులు సరుకును సీజ్ చేశారు. సింహాద్రి రైస్ ఇండస్ట్రీలో పట్టుబడ్డ రేషన్ బియ్యాన్ని ల్యాబ్ కు పంపించి పరిశీలించిన అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. కరోనా కష్టకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చూసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు ఏ ఒక్క పూట పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో ఉచితంగా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తుంటే కొందరు రైస్ మిల్లర్లు వారికి పైసల ఆశ చూపి వారి వద్ద రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నారని తద్వారా అదే రేషన్ బియ్యాన్ని రైస్ మిల్లులకు తరలిస్తున్నారు.