బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీసు స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. మూసీ ప్రక్షాళన పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.25వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కేటీఆర్ ఆరోపణలు చేశారు.
- Advertisement -
అయితే ఈ ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయంటూ కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు ఉట్నూరు పోలీసు స్టేషన్‌లో 2024 సెప్టెంబరు 30న కేసు నమోదైంది. దీంతో ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తాజా విచారణ సందర్భంగా ఇరువైపుల వాదనలు విన్న కోర్టు ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.