Wednesday, January 8, 2025
HomeతెలంగాణVC Sajjanar: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు సజ్జనార్‌ వార్నింగ్

VC Sajjanar: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు సజ్జనార్‌ వార్నింగ్

కాసులకి కక్కుర్తి పడి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేయకండి అంటూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఐపీఎస్ అధికారి, టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.

- Advertisement -

‘‘రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చని ఇన్‌ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో విడుదల చేసే వీడియోల వల్ల అమాయకులు ఆన్‌లైన్ బెట్టింగ్ మహమ్మారికి బానిసలవుతున్నారు. బంగారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. స్వలాభం కోసం ప్రజాశ్రేయస్సును విస్మరించడం ఎంత వరకు సమంజసం..? సమాజ క్షేమం పట్టని మీ పెడధోరణులు క్షమించరానివి. కష్టపడకుండానే కాసులు పోగేసుకోవాలన్న ఆలోచన అనర్థమని యువత గుర్తించాలి. స్వార్థ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల మాటలు నమ్మి ఆన్‌లైన్‌ బెట్టింగ్ మాయలో పడకండి. ఇలాంటి సంఘ విద్రోహ శక్తులకు దూరంగా ఉండండి’’ అని సజ్జనార్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News