తెలుగు రాష్ట్రాల తెలుగు దినపత్రిక ‘తెలుగుప్రభ’ ముద్రించిన సంవత్సర కాలంతో పాటు డైరీ, అన్ని విశేషాలతో కూడిన క్యాలెండర్ చాలా బాగుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టరు ధనసరి అనసూయ ( సీతక్క) అన్నారు. తన క్యాంప్ కార్యాలయంలో తెలుగుప్రభ దినపత్రిక ముద్రించిన నూతన డైరీ క్యాలెండర్ ను నెట్వర్క్ ఇన్చార్జి కే. గౌతమ్, సర్కులేషన్ ఇంచార్జి అయ్యన్న, ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యూరో తక్కలపల్లి శ్రీనివాస్, ములుగు జిల్లా బ్యూరో గుర్రపు శ్రీధర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేయడంలో పత్రిక కీలక పాత్ర పోషించాలని, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడానికి పత్రిక యాజమాన్యం సూచనలు సలహాలు చేయాలని కోరారు.
రెండు తెలంగాణ రాష్ట్రాలలో పత్రిక యాజమాన్యం ప్రతిరోజు పత్రికను ముద్రించడం గొప్ప విషయం అని, నేటి కాలంలో ఆన్లైన్లోకి పత్రికలు పరిమితం కావడం, తెలుగు దినపత్రిక సామాన్య ప్రజలు సైతం చదువుకోవడానికి వీలుగా ప్రతిరోజు పత్రికను ముదిరించడం గొప్ప విషయం అని కొనియాడారు. రానున్న రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుప్రభ దినపత్రికకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
పత్రికా యాజమాన్యం యధావిధిగా పత్రికను ముద్రించి అన్ని వర్గాల ప్రజల ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.