Thursday, April 10, 2025
HomeతెలంగాణSingareni Mahadharna: సింగరేణిపై కుటిల కుట్రలా? నిప్పులు చెరిగిన కొప్పుల

Singareni Mahadharna: సింగరేణిపై కుటిల కుట్రలా? నిప్పులు చెరిగిన కొప్పుల

సింగరేణి సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రను నిరసిస్తూ BRS పార్టీ ఆధ్వర్యంలో రామగుండం గోదావరిఖని కేంద్రంలో చేపట్టిన మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ..తెలంగాణలో బొగ్గు బంగారమైన సింగరేణి సంస్థలు బిజెపి ప్రభుత్వం కుటిల రాజకీయ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రామగుండం వచ్చిన సందర్భంగా సింగరేణిని ప్రైవేటుపరం చేయబోమని చెప్పి ఆరు నెలలు గడవకముందే, తానిచ్చిన మాటను నిలుపు కోకుండా గనులను మోడీ వేలం వేయడం తీవ్ర విచారకరమని మంత్రి అన్నారు.

- Advertisement -

సింగరేణి సంస్థను పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నదని, మరోసారి బొగ్గు బ్లాక్ ల వేలం వేయడాన్ని మహాధర్నా ఎండగట్టింది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రంపై సింగరేణి కార్మిక లోకం ముక్తకంఠంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం ఉన్నదాన్ని కేంద్రానికి కేవలం 49 శాతం మాత్రమే ఉన్నదని అలాంటి పరిస్థితులలో తాము చేయడం వీలుకాదని చెప్పి, నెల తిరగ ముందే కేంద్రం ప్రైవేటీకరణకు పావులు కదుపుతూ వారి కుటిల రాజకీయాలకు పావులు కదుపుతోంది అని మంత్రి కొప్పుల అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News