ముస్త్యాల గ్రామంలో పల్లె దావకానను మంథని ఎమ్మెల్యే దుద్ధిల్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని సూచించారు. అలాగే ముస్త్యాల గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య మాట్లాడుతూ ఒకప్పుడు గ్రామంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తే గోదావరిఖని ప్రాంతానికి వెళ్లేవారన్నారు. అయితే ప్రస్తుతం గ్రామాలకు అందుబాటులో ప్రజల కోసం వైద్యం అందించడానికి ప్రతి ఇంటికి ఆరోగ్య సౌకర్యాలు అందుతాయన్నారు. గ్రామస్థులు సర్పంచ్ గా గెలిపించినందుకు ఏ రాజకీయ ఒత్తిడులకి భయపడకుండా అధికారుల సలహాలు, సపోర్ట్ తో గ్రామస్థులకు గ్రామ దవాఖానాను నిర్మించామన్నారు.
నా బలం నా ధైర్యం గ్రామస్థులే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్త్యాల సర్పంచ్ రామగిరి లావణ్య, పీహెచ్ సి వైద్యధికారులు డా’ సంపంత్, డా, ప్రదీప్ కుమార్, ఎం పి టీ సి జనగామ హేమలత, ఉప సర్పంచ్ వేణుగోపాల్, వార్డ్ మెంబెర్స్ నర్సయ్య, రక్షిత్, లక్ష్మి, ఎం.ఎల్.ఎచ్.పి లత, వి ఓ సౌజన్య, కార్యదర్శి పరుశురాం, ఫీల్డ్ అసిస్టెంట్ సంపత్, ఏ ఎన్ ఎం, ఆశాలు మంథని ఎంఎల్ ఏ దుద్ధిల్ల శ్రీధర్ బాబు ను పూలమాలతో ఘనంగా సత్కరించారు.