Wednesday, October 2, 2024
HomeతెలంగాణTandur: తాండూరులో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు

Tandur: తాండూరులో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు

ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉందంటున్న లీడర్స్

బిఆర్ఎస్ పార్టీని చిత్తూల ఓడించడం ఖాయం అని డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు పూలమాలలతో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్, టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్, రఘువీర్ రెడ్డి, వికారాబాద్ మాజీ జెడ్పిటిసి మైపాల్ రెడ్డి హాజరయ్యారు.

- Advertisement -

ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ… బిఆర్ఎస్ పార్టీలో నాయకులకు ఎలాంటి గుర్తింపు లేదని, కార్యకర్తలను పట్టించుకోవడంలేదని కేవలం కుటుంబ పాలన బిఆర్ఎస్ పార్టీలో నడుస్తుందని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరు డిక్లరేషన్ ను చూసి పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నట్లుగా ప్రకటించారు. తాండూరులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి బిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో అమలు చేసిన పథకాలను వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే అమలు చేస్తామని అన్నారు. బిఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలు ఎక్కువయ్యాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. అదేవిధంగా నిరుపేదల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు సిద్ధమయ్యామని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్లాలా, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News