Thursday, December 19, 2024
Homeచిత్ర ప్రభTeenmar Mallanna: అల్లు అర్జున్‌పై తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు

Teenmar Mallanna: అల్లు అర్జున్‌పై తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) అరెస్ట్‌ వ్యవహారంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) సంచలన ఆరోపణలు చేశారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జాతీయ అవార్డు అతనొక్కడికే ఉండాలని అల్లు అర్జున్ కుట్ర పన్నలేదా? అని ప్రశ్నించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Johnny Master) జైలుకు వెళ్లడంలో అర్జున్ అర్జున్ కుట్ర ఉందా? లేదా? అని నిలదీశారు. ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చినా జానీ మాస్టర్‌కు వచ్చిన నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలని లేఖ రాసింది బన్నీ టీమ్ కాదా? అని ఆరోపించారు.

- Advertisement -

కాలం అన్నింటికి సమాధానం చెబుతుందని.. మహిళ మృతి కేసులో అల్లు అర్జున్ కూడా నిందితుడిగా జైల్లో ఒకరోజు ఉన్నార్ కదా? మరి ఇప్పుడు అల్లు అర్జున్ నేషనల్ అవార్డు వెనక్కి ఇస్తారా? అని మల్లన్న ప్రశ్శించారు. అసలు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ‘పుష్ప’ సినిమాకి నేషనల్ అవార్డు రావడం ఏమిటి? అంటూ ఘాటు విమర్శలు చేశారు. ప్రస్తుతం మల్లన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా రాత్రంతా చంచల్ గూడ జైలులో గడిపిన బన్నీ ఇవాళ ఉదయం విడుదలైన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News