Today Rain in tg: రాష్ట్రంలో నేడు కూడా భారీ తుఫానులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి – కొత్తగూడెం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది.
ఈరోజు తెలంగాణలో మళ్ళీ 2 రౌండ్ల భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రౌండ్ 1 లో మధ్యాహ్నం నుంచి రాత్రి సమయంలో పశ్చిమ, దక్షిణ, మధ్య తుఫాన్‌లో అక్కడక్కడ తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయన్నారు.
రౌండ్ 2 లో తూర్పు, దక్షిణ తుఫాన్ జిల్లాల్లో రాత్రి నుంచి ఉదయం వరకు విస్తృతంగా వర్షాలు కురుస్తాయి. మిగతా చోట్ల కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.
గడిచిన 24 గంటల్లో:
నిన్న సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచి కొట్టాయి. హైదరాబాద్ లోని బోయిన్ పల్లిలో అత్యధికంగా 115.3 మి.మీ వర్షపాతం నమోదైంది. రాత్రి 10 నుండి ఉదయం 6 వరకు వానలు పడుతూనే ఉన్నాయి. నేడు వాతావరణం లో వేడి చాలా ఎక్కువగా ఉంటుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. మధ్యాహ్నం వరకు ఎండ కొనసాగిన సాయంకాలం వరకు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అన్నారు. హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారుల ముందుగా చెప్పినట్టుగానే నిన్న సాయంకాలం నుండే రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు ప్రారంభం అయ్యాయని చెప్పుకొచ్చారు. గత కొన్ని వారాలుగా రాష్ట్రంలో చెప్పుకోదగ్గ వర్షాలు లేవన్న విషయం మీకు తెలిసిందే. వర్షాలు పడాల్సిన సమయంలో మాన్ సూన్ కు బ్రేక్ పడటం కాస్త నిరాశకు గురి చేసిందనే చెప్పాలి. అయితే వాతావరణ శాఖ అధికారులు సూచించినట్లే నేటి మళ్ళీ భారీ వర్షాలు కురుస్తాయని ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూసి చెప్పవచ్చు.
ముందే చెప్పినట్లుగా:
తెలంగాణలో మళ్ళీ నిన్నటి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు మొదలవుతాయని వర్షాలు కురుస్తాయని మొన్ననే హైదరాబాద్ వాతావరణ కేంద్రం గతంలోనే తెలిపింది. గత వారమంతా ఉన్న ఈదర గాలులు నేటి నుంచి తగ్గుముఖం పట్టనున్నట్లు తెలిపారు. తూర్పు, ఉత్తరం, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ప్రధానంగా సాయంత్రం నుంచి రాత్రి సమయంలో భారీ ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందన్నారు. అయితే నేడు విస్తృత తుఫానులను మాత్రం ఆశించవద్దన్నారు.


