Today Rains In TG: రాష్ట్రంలో మాన్ సూన్ వర్షాలకు బ్రేక్ పడింది. గత వారం ముసురు, మోస్తరు వర్షాలతో కూడిన వాతావరణం నిన్నటికి పూర్తిగా మారిపోయింది. నేడు హైదరాబాద్ నగరంతో సహా తెలంగాణ అంతటా పొడి వాతావరణం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. ప్రధానంగా ఈరోజంతా పొడి వాతావరణంతో ఉండి.. సాయంత్రం కొద్దిసేపు వర్షం పడుతుందన్నారు. ఇకపోతే నిన్నటి కంటే వర్షాలు చాలా వరకు తగ్గుముఖం పట్టీ.. రేపటి నుండి పూర్తిగా తగ్గుతాయన్నారు. అయితే ఎండలు పూర్తిగా తగ్గుముఖం పట్టలేదని అయితే ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణ స్థాయికి చేరుకుంటాయని పేర్కొంది.
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో వర్షపు లోటు కొంతవరకు తీరినా.. ఇంకా తీరాల్సిన అవసరం చాలా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అభిప్రాయ పడింది. ఇప్పటికీ రాష్ట్రంలోని వర్షపాతం మంచి స్థాయిలోనే ఉందని తెలిపింది. ఇకపోతే తెలంగాణలో జూన్ మొదటి వారంలోనే రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ, వాటి ప్రభావం అంతగా లేదు. రాష్ట్రంలో జూన్ మొదటి వారంలోనే రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ, వాటి ప్రభావం అంతగా లేదు. ప్రస్తుతం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భారీ వర్షాల కోసం మళ్ళీ ఆగస్టు వరకు వెయిట్ చేయాలని.. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తరించి, రైతాంగానికి ఉపశమనం కలిగించే అవకాశం తప్పక ఉంటుందని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆగస్టు 2 వారం నుండి మళ్ళీ:
గతం వారం రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసాయి. హైదరాబాద్ తో పాటు కరీం నగర్, ములుగు ప్రాంతాల్లో చాలా ఊర్లు నీళ్లలో మునిపోయిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వర్షాకాలానికి బ్రేక్ పడిన… వచ్చే నెల 2 వ వారం నుంచి అనగా ఆగస్టు 9-12 తర్వాత ఉరుములతో కూడిన తుఫానులకు సిద్ధంగా ఉండాల్సి వస్తుందన హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వర్షాలు ఖరీఫ్ సాగుకు కీలకమని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


