రాజకీయంగా ఓర్వలేకనే ఆమెపై పలువురు ఆరోపణలు చేస్తున్నారని అంకుషాపూర్ సర్పంచ్ కొయ్యడ ఎల్లవ్వ నాంపల్లి పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొద్ది రోజుల నుండి గ్రామ చెరువులోని చెట్లను అమ్ముకొని డబ్బులు తీసుకున్నారంటు ఆమెపై చాలా ఆరోపణలు వచ్చాయన్నారు. కానీ శనివారం నిర్వహించిన గ్రామ సభలో ఆ అంశంపై చర్చించిందని వెల్లడించాడు. అవన్నీ తప్పుడు ఆరోపణలని, గ్రామ అభివృద్ధి కోసం పాలకవర్గం సమక్షంలోనే.. గ్రామస్తుల అనుమతి మేరకే చెట్లను అమ్మారన్నారు. వాటి లెక్కలను గ్రామస్తుల ముందే చూపించారని, కొందరు పనికట్టుకుని, కావాలని, రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేక సర్పంచ్ పదవిని బద్నాం చేయాలని దురుద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. కాగా శనివారం జరిగిన లెక్కల్లో వారికే ఇంకా ఒక లక్ష 49వేల రూపాయలు తేలిందన్నారు. ఆధారాలతో సహా ప్రెస్ మీట్ నిర్వహించామని తెలియజేశారు. ఇకపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని, చట్టపరమైన చర్యలకు వెళతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగరాజు, వార్డు సభ్యులు, గ్రామస్తులు అంజయ్య, పర్షరాములు, కనకయ్య, జీల్ల ముత్తయ్య, ప్రశాంత్, పర్షరాములు, తదితరులు పాల్గొన్నారు.