Sunday, July 7, 2024
HomeతెలంగాణBRS Party: నేడు సతీసమేతంగా ఢిల్లీకి కేసీఆర్.. అక్కడే యాగాలు, పూజలు!

BRS Party: నేడు సతీసమేతంగా ఢిల్లీకి కేసీఆర్.. అక్కడే యాగాలు, పూజలు!

- Advertisement -

BRS Party: తెలంగాణ కోసమే పుట్టిన పార్టీగా వచ్చిన టీఆర్ఎస్ అర్ధాంతనమై బీఆర్ఎస్ పార్టీ పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. అధికారికంగా ఎన్నికల సంఘం బీఆర్ఎస్ పార్టీకి జాతీయ పార్టీ హోదా కూడా ఇచ్చేయగా.. కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇందులో ముందుగా ఢిల్లీ పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభించాలని చూస్తున్న కేసీఆర్ దానికి సంబంధించి ముమ్మర ఏర్పాట్లను చేస్తున్నారు.

ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలైన హరీష్ రావు, ఎంపీ సంతోష్ ఢిల్లీలోనే ఉంటూ అక్కడి పనులు చక్కదిద్దే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. కాగా, నేడు సీఎం కేసీఆర్ కూడా సతీసమేతంగా ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలోని సర్ధార్ పటేల్ మార్గ్ లో ఈనెల 14న బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అంతకుముందే సతీమణితో కలిసి అక్కడే రాజశ్యామల యాగం చేయనున్నారు.

ఇప్పటికే అక్కడ కార్యాలయం వాస్తు గురించి వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజతో చర్చించిన కేసీఆర్ మార్పులు, చేర్పుల పనులను ముమ్మరం చేశారు. హరీష్ రావు, సంతోష్ ఈ పనులు దగ్గరుండి చూసుకుంటుండగా.. నేడు కేసీఆర్ ఢిల్లీకి వెళ్లిన తర్వాత.. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా ఢిల్లీ బాట పట్టనున్నారు. సీఎం కేసీఆర్ కూడా కొద్దిరోజులు ఢిల్లీలోనే ఉండనుండగా.. కీలక గులాబీ నేతలు కూడా ఢిల్లీకే పయనమవుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News