ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందిన తెలుగుప్రభ దినపత్రిక నూతన క్యాలెండర్, డైరీలను సంజీవరెడ్డి నగర్ ట్రాఫిక్ సిఐ కొమురయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగుప్రభ పత్రిక యాజమాన్యానికి సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుప్రభ ప్రతినిధి గోనెల కుమారస్వామి, స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.