Friday, September 20, 2024
HomeతెలంగాణWarangal: ఘనంగా కార్మిక భేరి

Warangal: ఘనంగా కార్మిక భేరి

వరంగల్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరిగిన కార్మిక భేరిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్:

- Advertisement -

ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కారు హామీలు నీటి బుడగలేనని తేటతెల్లమైంది. 40 ఏండ్లలో ఎన్నడూ చూడని విధంగా దేశంలో నిరుద్యోగిత రేటు అంతకంతకూ పెరిగిపోతున్నా.. బీజేపీ సర్కారు మాత్రం దిద్దుబాటు చర్యలు చేపట్టట్లేదు. ఫలితంగా, దేశంలోని మొత్తం శ్రామిక శక్తి 85 కోట్లుగా ఉంటే, అందులో 22 కోట్ల మంది ఉద్యోగాల కోసం పడిగాపులు కాస్తున్నారు. గడిచిన 8 ఏండ్లలో దేశంలో బీజేపీ సర్కారు 6 లక్షల 90 వేల ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసింది. కానీ ఆ ఉద్యోగాలు చిన్న చిన్న చెప్రాసి ఉద్యోగాలే! ఏడాదికి 2 కోట్ల చొప్పున ఉద్యోగాలను ఇస్తామన్న బీజేపీ ప్రభుత్వం.. ఆ లెక్కన ఇప్పటివరకూ 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు రంగంలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించి యువతకు చేయూతగా నిలిచింది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా… అన్న బిజెపి ప్రభుత్వం ఏం చేస్తుంది ఉద్యోగాలు లేవు, ఉపాధి లేకుండా దేశాన్ని బీజేపీ పార్టీ నాశనం చేస్తుంది. కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు.

లాభాల్లో వున్న అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తుంది, అంబానీ, అదానీ ల కోసం మాత్రమే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. అంతే తప్ప నిరుద్యోగులకు, కార్మికులకు న్యాయం చేయాలనే ఆలోచన మోడీకి లేదు. కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసిఆర్ గారు ఒకవైపు కార్మికుల సంక్షేమం, మరోవైపు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ… రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నది. కార్మికులకు వైద్య బీమా, జీవిత బీమా వంటి పథకాలతో పాటు, కార్పొరేట్‌ దవాఖానల్లో ట్రీట్మెంట్ ను ప్రభుత్వం అందిస్తున్నది. రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం చక్కగా అమలవుతుందనడానికి దేశంలోని అన్ని రాష్ర్టాల నుంచి ఉపాధి కోసం హైదరాబాద్‌కు తరలి వస్తున్న కార్మికులే సాక్ష్యం. కరోనా కాలంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన కార్మికుల సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయనటువంటి చర్యలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు, చట్టాలను పకడ్బందీగా అమలుచేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం సంఘటిత, అసంఘటిత కార్మికుల సంక్షేమానికి భరోసా కల్పించేందుకు పలు చట్టాలను అమలు చేస్తున్నది. ఉద్యోగులు – యజమానుల మధ్య సామరస్య పూర్వక సంబంధాలను నెలకొల్పడానికి కార్మిక శాఖ మధ్యవర్తిత్వాన్ని నిర్వర్తిస్తున్నది. కార్మిక శాఖ ప్రమాద పరిహారం, వేతనాలు, గ్రాట్యుటీ మొదలైన వాటి కోసం రూ. 2014-15 నుండి 2022-23 మధ్య ఇప్పటి వరకు 406 కోట్ల 80 లక్షల రూపాయలను ఖర్చు చేసి, 11 వేల 303 క్లెయిములను పరిష్కరించింది.

కార్మిక శాఖ అనేక అవార్డులను అందుకున్నది. కలకత్తాలో జరిగిన ఒక కార్యక్రమంలో 2017 సంవత్సరానికి ఈ-గవర్నెన్స్ విభాగంలో తెలంగాణ కార్మికశాఖ “CSI-NIHILENT అవార్డును అందుకుంది. TS-iPass ఐదవ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఈవోడిబి (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) కింద తెలంగాణ కార్మిక శాఖ ఉత్తమ పనితీరుకు గాను అవార్డు అందుకుంది. ఆన్‌లైన్ సేవలను అందిస్తున్నందుకు 2020-21కి స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డును కార్మిక శాఖ అందుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News