ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిర్వహించే గ్రూప్2 పరీక్ష(Group2 Exams) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈనెల 23న రెండు సెక్షన్లలో పరీక్షలు జరగనున్నాయి. ఆరోజు ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు.. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. హాల్ టికెట్లను psc.ap.gov.in. సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు కేవలం హాల్ టికెట్ మాత్రమే తీసుకురావాలని మరే వస్తువులను తీసుకురావొద్దని ఏపీపీఎస్సీ సూచించింది.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-12-at-3.35.23-PM-730x1024.jpeg)