నంద్యాల కూరగాయల మార్కెట్లో జరిగిన అగ్నిప్రమాదం బాధాకరమని, రైతులు, పండ్ల వ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి డిమాండ్ చేశారు. మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో పర్యటించారు. ప్రమాదం జరిగిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారులు రైతుల వద్ద భారీ స్థాయిలో పండ్లు కొనుగోలు చేసి వ్యాపారాలు చేసేవారన్నరు. అకస్మాత్తుగా జరిగిన అగ్ని ప్రమాదంలో పండ్లతో పాటు వాహనాలు పూర్తిగా కలిపోయాయన్నారు. ఈ ప్రమాదంలో దాదాపు లక్షల్లో ఆస్తి నష్టం జరిగిందని అన్నారు.
మున్సిపాలిటీకి లక్షల్లో అద్దె డబ్బు కడుతున్నా కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. కోటి రూపాయలతో కట్టిన షెడ్డు నిరుపయోగంగా మారిందని అన్నారు. మార్కెట్ కు రోజు ఎందరో వస్తున్నా ఎక్కడా అగ్నిమాపక నిబంధనలు లేవన్నారు. ఎమ్మెల్యే, కలెక్టర్ పర్యటించారు కానీ నేటికీ ప్రభుత్వ సహాయం అందించలేదని అన్నారు.
ప్రభుత్వం నష్టపరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రూట్ మార్కెట్ వ్యాపారస్తులు అల్తాఫ్, షనూర్, బాషా భాయ్, ఆర్షద్ భాయ్, నూర్, అన్వర్, ఆయుబ్, మాహబూబ్ బాషా, కలాం, టీడీపీ నాయకులు మనియార్ ఖలీల్, మారం వినయ్, దస్తగిరి, అమిదెలా చందు, నాగార్జున, జె.పి,మస్తాన్, అమీర్, ఆఫజల్, సర్దార్, నజీర, సుబ్బారాయుడు, పల్లె వెంకటసుబ్బయ్య, వారీస్, అలీ, బుజ్జి, చెన్నం శెట్టి శ్రీనివాసులు, చలపతి పాల్గొన్నారు.