Saturday, March 1, 2025
Homeఆంధ్రప్రదేశ్Chandrababu: ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు శుభవార్త

Chandrababu: ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు శుభవార్త

ఆశా వర్కర్ల(Asha Workers)కు ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) శుభవార్త చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఆశా కార్యకర్తల గరిష్ఠ వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే తొలి రెండు ప్రసవాలకు 180 రోజులు వేతనంతో కూడిన సెలవులకు అనుమతి ఇచ్చారు. అంతేకాకుండా ఆశా కార్యకర్తలందరికీ ప్రయోజనం చేకూర్చేలా గ్రాట్యుటీ చెల్లించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన అధికారికి ఉత్తర్వులు త్వరలోనే విడుదల కానున్నారు.

- Advertisement -

కాగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 42,752 మంది ఆశా కార్యకర్తలు ఉండగా.. గ్రామాల్లో 37,017 మంది, పట్టణాల్లో 5,735 మంది ఉన్నారు. ప్రస్తుతం వారు నెలకు రూ.10వేల వేతనం పొందుతున్నారు. సర్వీస్‌ ముగింపులో గ్రాట్యుటీ కింద రూ.1.5 లక్షలు అందే అవకాశం ఉందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News