Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Prakasam Pantulu: ప్రకాశం పంతులుకు సీఎం చంద్రబాబు, జగన్ నివాళులు

Prakasam Pantulu: ప్రకాశం పంతులుకు సీఎం చంద్రబాబు, జగన్ నివాళులు

స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు(Prakasam Pantulu) వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు(CM Chandrababu) నివాళులు అర్పించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. “ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. నిరుపేద కుటుంబంలో పుట్టి, రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా వెలుగొంది, ‘ఆంధ్రకేసరి’గా కీర్తిప్రతిష్టలు పొందిన ఆ మహనీయుడు మనందరికి స్ఫూర్తి ప్రదాత. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొని బ్రిటీష్ తుపాకికి గుండెను చూపిన ఆయన సాహసం ఎన్నటికీ మరువలేం. శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగనిరతి ఆదర్శవంతం. ఆయనకు మరొక్కమారు ఘన నివాళి ఘటిస్తున్నాను” అని పేర్కొన్నారు.

- Advertisement -

ఇక వైసీపీ అధినేత జగన్(YS Jagan) కూడా నివాళి అర్పిస్తూ ట్వీట్ చేశారు. ‘స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులుగారు. తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ఆయన. నేడు ప్రకాశం పంతులుగారి వర్ధంతి సందర్భంగా నివాళులు’ అని రాసుకొచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad