నవంబర్ 21వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాలలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబర్ 23 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. తర్వాత, పశ్చిమ-వాయువ్య దిశగా కొనసాగి, ఆతదుపరి 2 రోజుల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.
- Advertisement -
దీని ప్రభావంతో ఈ నెల 27, 28 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. రైతులు ముందస్తుగా ఇప్పటి నుంచే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.