Tuesday, December 31, 2024
Homeఆంధ్రప్రదేశ్Tirumala: తిరుమలలో శ్రీవారి మెట్టు వద్ద భక్తులు ఆందోళన

Tirumala: తిరుమలలో శ్రీవారి మెట్టు వద్ద భక్తులు ఆందోళన

తిరుమలలో(Tirumala) ఉద్రిక్తత నెలకొంది. శ్రీవారి మెట్టు దగ్గర భక్తులు ఆందోళనకు దిగారు. టైం స్లాట్‌ దర్శనం టోకెన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోజుకు మూడు వేల టోకెన్లు జారీ చేస్తున్నారని వాపోయారు. దర్శనం టోకెన్ల దందా సాగుతుందని.. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి టోకెన్లు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత వాహనాల్లో వచ్చే వారికి టోకెన్లు ఇవ్వడం లేదని.. ఆటోల్లో వచ్చే వారికి మాత్రమే టోకెన్లు ఇస్తున్నారని తెలిపారు. ఆటోడ్రైవర్లు, టీటీడీ సిబ్బంది కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన టీటీడీ(TTD) అధికారులు సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

- Advertisement -

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్ని నిండిపోయి వెలుపల క్యూలైనులో భక్తులు వేచి ఉన్నారు. టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఇక శనివారం శ్రీవారిని 78,414 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,100 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల ద్వారా శ్రీవారి హుండి ఆదాయం రూ.3.45 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News