ఎమ్మిగనూరు పట్టణంలో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అబ్బాస్ టాకీస్ వద్ద ఉన్న అభయ ఆంజనేయ స్వామి దేవాలయం, వీవర్స్ కాలని ఆంజనేయ స్వామి దేవాలయం, పాత 11 వ వార్డు ఆంజనేయ స్వామి దేవాలయం లో హనుమాన్ జయంతి ను ఘనంగా జరుపుకున్నారు. జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు బాలాజీ, శ్రీనివాసులు, రామదాసు గౌడ్, శశిదర్ రెడ్డి, నాగరాజు అధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన వీధులలో హనుమాన్ చిత్ర పటాన్ని భక్తులు ఊరేగింపు నిర్వహించారు. అన్నదానం నిర్వహించి ఆటల పోటీలు నిర్వహించారు. అభయ ఆంజనేయ స్వామి దేవాలయంతో పాటు పాత 11 వ వార్డులో ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి, బిజేపి ఇంఛార్జి కేఅర్ మురారి రెడ్డితో పట్టణ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Emmiganuru: ఘనంగా హనుమాన్ జయంతి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES