నాణ్యమైన విద్యను అందించాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి సూచించారు. ఎమ్మిగనూరు పట్టణంలో సివి రామన్ జూనియర్ కళాశాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదివి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆయన అన్నారు. అలాగే మంచి చదువులు చదివి అమెరికా, దుబాయ్, వంటి దేశాలు వెళ్లి పెద్ద పెద్ద చదువులు చదివి, ర్యాంకు సాధించి తెలుగు తేజాలుగా నిలవాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ గురజాల గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ సివి రామన్ కాలేజ్ లో చేరిన విద్యార్థిని విద్యార్థులు ఐఐటి, జేఈఈ, మెయిన్స్ వంటి ఫలితాలలో మంచి ర్యాంకులు సాధించాలని అన్నారు. మా కళాశాలలో ఎంపీసీ, బైపిసి, ఎంఈసి, సిఈసి కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మా కళాశాల నందు చేరేవారికి ఐఐటి, జేఈఈ, మెయిన్స్ వంటి పరీక్షలకు ఉచితంగా కోచింగ్ ఇస్తామన్నారు.
Errakota Chennakeshava Reddy: నాణ్యమైన విద్య అందించాలి
సీవీ రామన్ కాలేజ్ ప్రారంభం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES