రేణిగుంట విమానాశ్రయంలో(Renigunta Airport) తాత్కాలికంగా విమాన(Flight) రాకపోకలు ఆగిపోనున్నాయి. దీంతో ప్రయాణాలను రద్దు చేసుకోవాలని అధికారులు తెలుపుతున్నారు. దీంతో తిరుమలకు వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రత్యామ్నాయ మార్గాలు
రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలకు వచ్చే భక్తులతో పాటుగా వైద్య, విద్య, ఆర్థిక అవసరాల నిమిత్తం హైదరాబాద్, వైజాగ్, ముంబై, విజయవాడ, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాలకు ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తూ వస్తున్నారు. వీరు కూడా గమనించుకుని ప్రయాణాలకు వేరే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని తెలుపుతున్నారు.
కారణం ఇదే
రేణిగుంట ఎయిర్ పోర్టును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నారు. దీంతో మూడు రోజుల పాటు పలు విమానాలు రద్దు చేశారు విమానాశ్రయ అధికారులు. రేణిగుంట విమానాశ్రయం రన్వే పనుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి రాకపోకలు సాగించి పలు విమాన సర్వీసులు రద్దు కానున్నాయి.
రన్వే విస్తీర్ణం పొడగింపు
రేణిగుంట విమానాశ్రయంలో ఉన్నా రన్వే విస్తీర్ణాన్ని మరింత పొడిగించాలని అధికారులు ప్రణాళిక వేశారు. 19 తేదీ మధ్యాహ్నం 3.30 నుంచి 20 తేదీ ఉదయం వరకు తిరిగి 20 తేదీ మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 21 తేదీ ఉదయం వరకు తిరిగి మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 22 వ తేదీ ఉదయం వరకు రన్వేపై మార్కింగ్ లైటింగ్ పనులు చేపట్టనున్నారు.
రాకపోకలు బంద్
ఈ నేపథ్యంలో హైదరాబాద్, బెంగళూర్ నుంచి ఈ వేళలో రాకపోకలు సాగించే విమానాల రాకపోకలను ఆయా సంస్థలు బంద్ చేశాయి.