అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడి(Elephant Attack)లో భక్తుల మృతిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద ఏనుగుల దాడిలో భక్తులు మృతి చెందడంపై మాజీ ముఖ్యమంత్రి(Ex cm Jagan) జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్తున్న భక్తులు ఏనుగుల దాడిలో మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం గుండాల కోన వద్ద ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తులు మృతి చెందడంపై అన్నమయ్య జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి & రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగుల దాడి చేయడంపై జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు మంత్రి.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం సహాయం అందించాలని కలెక్టర్ చామకూరి శ్రీధర్ ను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.
Jagan: ఏనుగుల దాడిలో భక్తుల మృతిపై మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం
- Advertisement -
సంబంధిత వార్తలు | RELATED ARTICLES