Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Gangula: రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Gangula: రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. చాగలమర్రి మండలం పెద్ద భోదనం గ్రామంలో 21.80 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసిన గంగుల బ్రిజెంద్రా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ దేశానికి వెన్నెముక రైతు అని రైతులను అన్ని విధాల ఆదుకొనడమే ప్రభుత్వ ధ్యేయమని రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్టు ఆయన తెలిపారు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు మరియు ప్రోత్సాహాల ద్వారా వ్యవసాయని సాగు ద్వారా సంబరం చేస్తూ రైతన్నల పండుగను చేస్తున్నారని సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు సున్నా వడ్డీని మరియు రైతు భరోసా ఇన్స్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ తదితర రైతన్నల సంక్షేమానికి మన ప్రభుత్వం ముందుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతన్నలకు ఈక్రాప్ ఇన్సూరెన్స్ ఇన్స్పుట్ సబ్సిడీ నేరుగా రైతన్న ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వం మనదేనని ఎమ్మెల్యే గంగుల తెలిపారు . ఈ కార్యక్రమంలో ఎంపీపీ వీరభద్రుడు మండల కన్వీనర్ కుమార్ రెడ్డి ముస్లిం మైనారిటీ రాష్ట్ర సెక్రటరీ షేక్ బాబూలాల్ పెద్ద భోదనం సర్పంచ్ యామ నరసమ్మ చిన్న భోదనం సర్పంచ్ ముడియం శివమ్మ వైకాపా నాయకులు యమా బాలకృష్ణారెడ్డి రమణారెడ్డి నరసింహారెడ్డి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
అనంతరం చాగలమర్రిఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే గంగుల అధ్యక్షతన చాగలమర్రి మండల సర్వసభ్య సమావేశం జరిగింది .ఈ సమావేశంలో ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ ముఖ్యంగా మే నెలలో త్రాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుందని త్రాగునీటి కోసం ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదని అందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే గంగుల తెలిపారు.
ఈ కార్యక్రమంలో ,చాగలమర్రి ఎంపీపీ వీరభద్రుడు, జడ్పిటిసి లక్ష్మీదేవి ,పెద్దభోధనం సర్పంచ్ యామా నర్సమ్మ ,చిన్న భోధనం సర్పంచ్ ముడియం శివమ్మ , ఇతర సర్పంచులు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News