వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని శక్తులు ఏకమై పోటీ చేసినా ప్రజాబలం ఉన్న మా నాయకుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని మాజీ ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజెంద్రారెడ్డిలు ధీమా వ్యక్తం చేశారు. చాగలమర్రిలోని ఒక కార్యక్రమానికి హాజరైన వారు విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడమే గాక, ఇవ్వని హామీలను కూడా అమలు చేశారని ప్రశంసించారు . నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి మేలు జరిగిందని వారు తెలిపారు. అందుకే ప్రజల మధ్యకు తాము ధైర్యంగా వెళ్లగలుగుతున్నామన్నారు . గత తెలుగుదేశం పాలనలో పచ్చ చొక్కాల వారికే సంక్షేమ పథకాలు అందించి అర్హులైన పేదలకు తీరని అన్యాయం చేశారని వారు ఆరోపించారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను తెలుగుదేశం నాయకులు మోసం చేశారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వంలో పార్టీలకు, వర్గాలకు, కుల మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని వారు తెలిపారు . జగన్ జనరంజక పాలన చేస్తున్నారని వారు కొనియాడారు. తెలుగుదేశం పాలనలో ప్రజలకు చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారని కనీసం రైతు రుణాల మాఫీ చేయలేకపోయారని వారు ధ్వజమెత్తారు . రైతులపై చంద్రబాబుకు ఎంత ప్రేమ ఉందో దీనిని బట్టి అర్థమవుతుందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతన్నల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడమే గాక రైతు భరోసా ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ పంటలు దెబ్బతిన్నప్పుడు వెంటనే నష్టపరిహారం అందిస్తూ రైతులను అన్ని విధాల ఆదుకుంటున్నారని వారు తెలిపారు . ప్రజా బలమున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఓడించడం చేతగాక తెలుగుదేశం పార్టీ ఇతరుల సహాయం పొందుతున్నదని వారు ఆరోపించారు. ఆ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే జగనన్నను ఆ ఒక్క పార్టీయే ఎదుర్కోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని కుట్రలు పన్నాగాలు చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓడించలేదని వారు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ చెబుతున్న విధంగా తమ పార్టీ 175 కు 175 సీట్లను ప్రజల ఆశీస్సులతో గెలుచుకొని అధికారంలోకి వస్తామని వారు తెలిపారు . ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబూలాల్ , ఆ పార్టీ మండల కన్వీనర్ కుమార్ రెడ్డి, మండలాధ్యక్షుడు వీరభద్రుడు, వైస్ ఎంపీపీ ముల్లా రఫీ ఇబ్రహీం , ఎంపీటీసీ సభ్యులు పత్తి నారాయణ, లక్ష్మిరెడ్డి, ఫయాజ్, ముల్లా జాబీర్ ,శేషురమేష్ , సర్పంచ్ గోవిందయ్య, గణేష్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి రామగురివిరెడ్డి, వైసిపి నాయకులు రాచమడుగు చెంచు సుబ్బారావు, బచ్చు సుబ్రహ్మణ్యం, నాగేంద్ర, ఐడియా బాబు, కృష్ణం శేఖర్, గేట్ల మహబూబ్ సాబ్ , వెంకట సుబ్బారెడ్డి, ముల్లా ఖాదర్బాషా, ముల్లా ఇబ్రహీం, ముల్లా బ్రాందీన్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.
Gangula: ఎన్ని శక్తులు ఏకమైనా జగన్ను ఓడించలేరు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES