Saturday, September 28, 2024
Homeఆంధ్రప్రదేశ్Gonegandla: గ్రామ సచివాలయ భవనం ప్రారంభం

Gonegandla: గ్రామ సచివాలయ భవనం ప్రారంభం

అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం వైసీపీ

గోనెగండ్ల మండల పరిధిలోని హెచ్ కైరవాడి గ్రామంలో ఒక కోటి నలభై లక్షల రూపాయలతో నిర్మించిన నూతన సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి శిలాఫలకం ఆవిష్కరించి, రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి కి గ్రామ వైసిపి నాయకులు ఖాజా బంధన్ ఆవాజ్ మోహన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి పులికొండలు పూలవర్షంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హెచ్ కైరవాడి గ్రామంలో వైయస్సార్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సిసి రోడ్లు, డ్రైనేజీ, నాడు నేడు ద్వారా పాఠశాల రూపురేఖలు మారుస్తూ పాఠశాలకు కాంపౌండ్ వాల్ నిర్మించామన్నారు.

- Advertisement -

నవరత్నాల ద్వారా గ్రామంలోని ప్రతి ఇంటికి అమ్మ ఒడి, చేయూత, విద్యాదీవేన, జగనన్న విద్యా కానుక, జగనన్న చేదోడు, వివిధ రకాల పెన్షన్లు వంటి వివిధ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా ప్రభుత్వం ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ద్వారా ఇంటికి లబ్ధి చేకూరేలా కృషి చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం ప్రజలకు ఏమి చేయకపోగా జన్మభూమి కమిటీల పేరుతో ఆఫీసుల చుట్టూ, నాయకుల చుట్టూ ప్రజలను తిప్పుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకులు బిజెపితో పొత్తు కుదుర్చుకునేందుకు నాన్న తండాలు పడుతున్నారని అన్నారు. మళ్లీ ఎలక్షన్లు వస్తున్న సందర్భంగా గ్రామాల్లోకి మాయమాటలు చెప్పేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తుంటారని వారిని ఇప్పటి వరకు గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేశారో చెప్పమని ప్రజలు నిలదీయాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో ప్రజల కష్టాలను తెలుసుకొని చేస్తానని ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రజల గుండెల్లో మంచి స్థానం సంపాదించుకున్నారని అన్నారు. అనంతరం గ్రామ మాజీ సర్పంచ్ ఖాజా బంధ నవాజ్ మాట్లాడుతూ మా గ్రామంలో రైతులు సాగునీరు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్న సమయంలో ఎర్రకోట చెన్నకేశవరెడ్డి చొరవ తీసుకొని గాజులదిన్నె ప్రాజెక్టు ద్వారా ఎల్ఎల్సీ ద్వారా రైతులకు సాగును సాగునీటిని, గ్రామ ప్రజలకు త్రాగునీటిని అందించిన ఘనత పెద్దాయన చెన్నకేశవరెడ్డి కే దక్కుతుందని అన్నారు.

అలాగే ప్రస్తుతం వైయస్సార్ ప్రభుత్వం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పదవి చేపట్టిన తర్వాత కైరవాడి గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీ కాలువలు పాఠశాల రూపురేఖలు మారుస్తూ నాడు నేడు కింద పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మించామని అన్నారు. కావున 2024 ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజల సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం గ్రామస్తులు ఖాజా బందేనవాజ్, మోహన్ రెడ్డి, పులికొండలతో పాటు మరికొందరితో కలిసి స్థలదాత అయిన ఆర్ గోవిందరెడ్డి కుమారులు ఆర్.విశ్వనాథ రెడ్డి, ఆర్. రాజేంద్రరెడ్డిలను శాలువా పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సువర్ణ, పంచాయతీరాజ్ డిఇ చంద్రశేఖర్, పంచాయతీరాజ్ ఏఈ శివశంకర్, మండల తహసిల్దార్ వేణుగోపాల్, మండల అభివృద్ధి అధికారి ప్రవీణ్ కుమార్, వైస్ ఎంపీపీ వెంకట్రామిరెడ్డి, ఎంపీటీసీ యాసిన్ బి సింగల్ విండో అధ్యక్షులు తిరుమలరెడ్డి, మండల యూత్ అధ్యక్షులు బందనవాజ్, సొసైటీ ఉపాధ్యక్షులు భాస్కర్ రెడ్డి, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మన్సూర్, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు కాశిరెడ్డి , గ్రామ సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, గ్రామ వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News