Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్YCP: వైసీపీకి షాక్.. గుంటూరు మేయర్‌ మనోహర్‌ నాయుడు రాజీనామా

YCP: వైసీపీకి షాక్.. గుంటూరు మేయర్‌ మనోహర్‌ నాయుడు రాజీనామా

అసలే అధికారం కోల్పోయిన వైసీపీ(YCP)కి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు(Manohar Naidu) తన పదవికి రాజీనామా చేశారు. 2021లో వైసీపీ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన మనోహర్‌నాయుడు మేయర్‌గా ఎన్నికయ్యారు.

- Advertisement -

ఫిబ్రవరిలో జరిగిన గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో.. ఆరు స్థానాలను టీడీపీ, జనసేన కార్పొరేటర్లు కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 17న స్టాండింగ్‌ కమిటీ సమావేశం జరగనుంది. మేయర్‌ మనోహర్‌ నాయుడిపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశముంది. మరోవైపు నగర కమిషనర్‌ పులి శ్రీనివాసులు, మనోహర్ మధ్య వివాదం నెలకొంది. దీంతో మరో ఏడాది పదవీ కాలం ఉండగానే తన పదవికి రాజీనామా చేశారు. మేయర్ రాజీనామాతో కూటమి కార్పొరేటర్ల నుంచి ఒక్కరు మేయర్‌గా ఎన్నిక కానున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad