Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Heat waves: రేపు 29 మండలాల్లో వడగాల్పులు

Heat waves: రేపు 29 మండలాల్లో వడగాల్పులు

రాష్ట్రంలో రేపు 29 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. అనకాపల్లి జిల్లా 5, గుంటూరు 1, కాకినాడ 1, ఎన్టీఆర్ 2, పల్నాడు 2, మన్యం 5, విజయనగరం 5, వైఎస్సార్ జిల్లాలోని 8 మండలాలు, ఎల్లుండి 33 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. గురువారం నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 45.1°C, పల్నాడు జిల్లా మాచర్ల, శ్రీకాకుళం జిల్లా కొత్తూరు, వైస్సార్ జిల్లా బద్వేల్ లో 45°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనవని వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం, వల్లూరు మండలంలో తీవ్రవడగాల్పులు, 27 మండలాల్లో వడగాల్పులు వీచాయని వివరించారు.

- Advertisement -

ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు బయటకు రాకుండా ఉండలన్నారు. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

రేపు కింద విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వివరించారు

☀ మే 19 శుక్రవారం
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44°C – 45°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

• విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, SPSR నెల్లూరు కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C – 43°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

• కోనసీమ, పశ్చిమ గోదావరి, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40°C – 41°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News