బడుగు బలహీన వర్గాల ఆశాకిరణం జగనన్న అని ఆయన అడుగుజాడల్లో మనమందరం నడుద్దామని వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కప్పట్రాళ్ల బొజ్జమ్మ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని జిల్లేడుబుడకల గ్రామంలోని తన స్వగృహంలో మాజీ ఎంపీపీ రామచంద్రనాయుడు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా భారీ కేకును కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చెల్లెలచెలిమల, బంటుపల్లి, పి.కోటకొండ, కరివేముల, బి సెంటర్ గ్రామాలకు చెందిన 50 కుటుంబాలకు పైగా వైసీపీ పార్టీలోకి పార్టీ కండువాలు కప్పి ఆమె ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి జగనన్న కృతనిశ్చయంతో ఉన్నారని గుర్తు చేశారు. జగనన్న అన్ని వర్గాలకు అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అందరి మన్ననలు పొందుతూ నిండు నూరేళ్లు ఉండేలా ప్రజల ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో దేవనకొండ ఎంపీటీసీ తపాల శ్రీనివాసులు, తెర్నేకల్ మాజీ సర్పంచ్ రాజన్న, నల్లచలిమల మధ్యాహ్నమయ్య, పి.కోటకొండ భాస్కర్, చెల్లెలచలిమల మాజీ ఎంపీటీసీ చెన్నకేశవులుగౌడ్,వివిధ గ్రామాల నుండి వైసిపి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
