రేషన్ బియ్యం వ్యవహారంలో వైసీపీ నేత పేర్ని నాని(Perni Nani) వ్యాఖ్యలకు తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో చేసిన అరాచకాలు మర్చిపోయారా అని ప్రశ్నించారు. తనను టార్గెట్ చేసి కేసులు పెట్టించినప్పుడు కుటుంబం కనబడలేదా అన్నారు. నానికేనా పిల్లలు, భార్య ఉంది.. తమకు లేరా అంటూ మండిపడ్డారు. మంత్రిగా ఉన్నప్పుడు మహిళలు గుర్తుకురాలేదా అని నిలదీశారు.
ప్రెస్ మీట్ లో నాని మాట్లాడుతుంటే ముఖంలో రక్తం చుక్క కనబడలేదని చురకలు అంటించారు. గుడివాడ నాయకులు ఎక్కడికి వెళ్లారని నిలదీశారు. వైసీపీ హయాంలో ఐదేళ్లు టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేయలేదా అని ధ్వజమెత్తారు. నీచంగా మాట్లాడిన నాయకులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మంచోడు కాబట్టి ఊరుకున్నారని.. లేదంటే ఈపాటికి మీ పరిస్థితి ఏంటన్నారు. పాపం పవన్‌ను ఎన్ని మాటలన్నారు.. ఆయన నాలుగు పెళ్లిళ్లు చేసికుంటే నీకేంటి..?. విడాకులు తీసుకుని చేసుకుంటారని ఫైర్ అయ్యారు.
అలాగే చంద్రబాబు(Chandrababu)ను దూషిస్తారా..?, భువనేశ్వరి(Bhuvaneswari) గురించి అసెంబ్లీలో ఎన్ని మాటలు అన్నారని గుర్తు చేశారు. చంద్రబాబు మమ్మల్ని ఆపారని.. లేకుంటే టీడీపీ కార్యకర్తలు తాట తీసేవారని హెచ్చరించారు. చంద్రబాబు మంచితనంతో బతికిపోతున్నారని..అందుకే ఆరు నెలలకే బయటకొచ్చి మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని పరితపిస్తున్నారని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.మీ ఆడవాళ్లు గురించి మాట్లాడితే చాలా ఉందని.. సభ్యత ఉంది కాబట్టి మాట్లాడటం లేదన్నారు. విక్టోరియా ఎవరో మచిలీపట్నంలో అడుక్కో పో అని విమర్శించారు. నీ బ్యాటరీ వీక్ అయింది. వెళ్లి చూసుకో అంటూ సెటైర్లు వేశారు.