Wednesday, December 4, 2024
Homeఆంధ్రప్రదేశ్AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్.. కీలక నిర్ణయాలు ఇవే

AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్.. కీలక నిర్ణయాలు ఇవే

AP Cabinet| రాజధాని ఉండవల్లిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), హోమ్ మంత్రి అనిత(Anita), మంత్రి నారా లోకేష్(Nara Lokesh)తో పాటు ఇతర శాఖల మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలో కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ప్రతిపాదనతో పాటు కాకినాడ పోర్టు భద్రత సహా తదితర అంశాలపై కేబినెట్‌లో ప్రధానంగా చర్చించారు.

- Advertisement -

ముఖ్యంగా పలు కారణాలతో గత ఐదేళ్లలో నిర్మాణం మొదలు పెట్టని గృహాలను రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక సీఆర్‌డీఏ(CRDA) అథారిటీ ఆమోదించిన 23 అంశాలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. వీటితో పాటుగా సమీకృత పర్యాటక పాలసీ 2024-29కి ఆమోదించింది. పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినంగా పాటించాలని కేబినెట్‌లో నిర్ణయించింది. ఏపీ టెక్స్‌టైల్ గార్మెంట్, ఏపీ మారిటైమ్ పాలసీలకు ఆమోదం తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News