Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool Collector: వలసలు వెళ్ళే ప్రాంతాల్లో పనులు కల్పించండి

Kurnool Collector: వలసలు వెళ్ళే ప్రాంతాల్లో పనులు కల్పించండి

కలెక్టర్ సృజన ఆదేశాలు

వలసలు వెళ్ళే ప్రాంతాల్లో కూలీలకు పనులు కల్పించి వలసల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన డ్వామా పిడిని అదేశించారు. కలెక్టరేట్ నుండి వివిధ ప్రభుత్వ పథకాల అమలుపై జిల్లా,మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూవలసల నివారణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ కింద ప్రస్తుతం ఉన్న వంద రోజులు పని దినాలు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.. వలసలను నివారించేందుకు ఉపాధి హామీ కింద పని రోజులు 100 నుండి 150 కి పెంచాలని చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగిందని, త్వరలోనే అందుకు సంబంధించిన ఉత్తర్వులు రానున్నాయని తెలిపారు..9చెత్త సంపద తయారీ కేంద్రాలు రూఫ్ లెవెల్ ఉండే వాటిని స్టేజ్ కన్వర్షన్ చేసే పనులలో ఆదోని, కౌతాళం, మంత్రాలయం మండలాలు పురోగతి సాధించడం లేదని, సోమవారం నాటికి బేస్మెంట్ స్థాయి లో ఉండేవి రూఫ్ లెవెల్ కి రావాలి, రూఫ్ లెవెల్ స్థాయిలో ఉండేవి పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జగనన్నకు చెబుదాంకి సంబంధించి అర్జీలలో ఎక్కువగా రెవెన్యూ, పంచాయతీ రాజ్, సర్వే శాఖలకు సంబంధించిన అర్జీలు వస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. సర్వే శాఖకు సంబంధించి ఆస్పరి, దేవనకొండ, కోడుమూరు, నందవరం, మంత్రాలయం మండలాలో ఎక్కువ శాతం రీ ఓపెన్ కేసులు ఉన్నాయని వాటి వివరాల గురించి చెప్పమని సంబంధిత మండలాల సర్వేయర్ లను ఆరా తీశారు.. మంత్రాలయం సర్వేయర్ నుండి ఎటువంటి సమాచారం లేకపోవడంతో వారి పై తగిన చర్యలు తీసుకోవాలని ఎడి సర్వేయర్ ని కలెక్టర్ ఆదేశించారు. పంచాయతీ రాజ్ కి సంబంధించి ఎక్కువ శాతం రీ ఓపెన్ కేసులు అస్పరి, హలహర్వి, గొనేగండ్ల, మద్ధికెర మండలాలో ఉన్నాయన్నారు. రీ ఓపెన్ కేసులు ఎక్కువ శాతం ఉన్న మండలాలో సంబంధిత స్పెషల్ ఆఫీసర్లు వెళ్లి వారితో సమీక్షించి సమస్య ఎక్కడ ఉందని తెలుసుకొని తన దృష్టికి తీసుకొని రావాలన్నారు.

- Advertisement -

రీ సర్వే లో భాగంగా గ్రౌండ్ ట్రూతింగ్ కి సంబంధించి ఆలూరు, మంత్రాలయం, అస్పరి మండలాలు ఈ నెల 28 వ తేదీ నాటికి పూర్తి చేస్తామని చెప్పి ఇంతవరకు పూర్తి చేయలేదని, అస్పరి మండలం చాలా నెమ్మదిగా చేస్తున్నారని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఎల్పిఎం జనరేషన్ లు కూడా నిర్దేశించిన గడువులోపు చేయడం లేదని నిర్దేశించిన గడువు లోపు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. హౌసింగ్ కి సంబంధించి చిప్పగిరి, కొసిగి, హోలగుంద, నందవరం మండలాలో పర్సంటేజ్ ఆఫ్ గ్రౌండింగ్ శాతంలో పురోగతి లేదని పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత మండలాల ఎంపిడిఓ లను కలెక్టర్ ఆదేశించారు. ఆప్షన్ 3 కింద నిర్మిస్తున్న ఇళ్లలో చిప్పగిరి మండలంలో పురోగతి లేదన్నారు. బేస్మెంట్ లెవెల్ స్థాయి నుండి కంప్లిషన్ స్థాయికి సంబంధించి ఆదోని అర్బన్, ఓర్వకల్, పత్తికొండ, మద్దికెర, మండలంలో జీరో పురోగతి నమోదు చేశారని ఇంకొకసారి జీరో పురోగతి నమోదు చేస్తే చర్యలు తప్పవన్నారు. సోక్ పిట్ జనరేషన్ కి సంబంధించి కొన్ని మండలాలు 100 శాతం పురోగతి సాదిస్తుంటే ఆదోని, ఓర్వకల్,పత్తికొండ, చిప్పగిరి, మంత్రాలయం మండలాలు మాత్రం తక్కువ పురోగతిలో ఉన్నాయని పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కన్సిస్టెంట్ రిథమ్ కి సంబంధించి స్కూల్ ఇన్స్పెక్షన్ లో కౌతాళం, పెద్దకడుబురు, కృష్ణగిరి తక్కువ శాతం పురోగతి సాధించారని, హాస్టల్ తనిఖీ లో పెద్దకడుబురు, అంగన్వాడి తనిఖీలో భాగంగా పలు అంశాలపై ఫిర్యాదులు వచ్చాయని, సంబంధిత సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఐసిడిఎస్ పిడి ని కలెక్టర్ ఆదేశించారు. ఆడుదాం ఆంధ్ర కి సంబంధించి పెండింగ్ ఉన్న మాస్టర్ డేటాను ఎంపిడిఓలు రేపు సాయంత్రం నాటికి వివరాలను వెరిఫై చేసి పంపాలన్నారు. అదే విధంగా వచ్చే సోమవారం నాటికి క్రీడల నిర్వహణకు అనువైన మైదానాలను గుర్తించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్ఈ సుబ్రమణ్యం, డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News