Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళి

Kurnool: జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళి

ఘనంగా మహాత్మా గాంధీ 154వ జయంతి వేడుకలు

జాతిపిత మహాత్మా గాంధీజీ ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి ఘన అర్పించిన, అనంతరం నగరంలోని బిర్లా గేట్ జంక్షన్ నందు కర్నూలు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉప్పు సత్యాగ్రహం (దండి మార్చ్) విగ్రహాన్ని ఆవిష్కరించిన స్థానిక ప్రజా ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమీషనర్, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ దండి మార్చి అనగా “ఉప్పు సత్యా గ్రహం” (సాల్ట్ సత్యాగ్రహ) అని పిలవబడే ఈ ఉద్యమం 1930లో భారతదేశంలో మహాత్మాగాంధీజీ నేతృత్వంలో ప్రారంభించబడిన అహింసాయుత నిరసన, ఈ ఉద్యమం మార్చి 12వ తేది నుండి ఏప్రిల్ 5వ తేది వరకు అంటే 24 రోజుల పాటు కొనసాగిందన్నారు. ఇది భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఒక ముఖ్యమైన సంఘటనగా తెలుపబడిందన్నారు. భారతీయులపై భారీ పన్నులు విధించిన ఉప్పు ఉత్పత్తి, అమ్మకాలపై బ్రిటిష్ వలసరాజ్యాల గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడమే ఈ ఉప్పు సత్యాగ్రహం (దండి మార్చ్) ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమన్నారు.

గాంధీజీ మరియు అతని అనుచరులు సముద్రపు నీటి నుండి తమ స్వంత ఉప్పును ఉత్పత్తి చేయడానికి సబర్మతి ఆశ్రమం నుండి అరేబియా సముద్రతీరంలోని దండి అనే గ్రామం వరకు 387 కి.మీ. పైగా నడిచి వెళ్లారని, ఈ యాత్ర అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిడమే కాక భారతీయ స్వేచ్చ కోసం విస్తృత ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందన్నారు. ఈ స్మారక చిహ్నం దండి మార్చ్ ను సూచిస్తుందన్నారు. ఈ పదకొండు విగ్రహాల సమిష్టి పది విభిన్న సామాజిక సాంస్కృతిక, మతపరమైన మరియు ఆర్థిక నేపథ్యాల నుండి గాంధీజీని అనుసరించే వ్యక్తులను సూచిస్తాయని తెలిపారు. జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లడుతూ గాంధీజీ బ్రిటిషుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహానుభావుల్లో గాంధీజీ అగ్రస్థానంలో ఉంటారన్నారు. అందుకే వారిని మహాత్ముడని, జాతిపిత అని గౌరవవించుకుంటున్నామని సత్యము, అహింసలనే సిద్ధాంతాలుగా నమ్మి సత్యాగ్రహం ద్వారా ఆంగ్లేయుల నుండి భారతదేశానికి స్వాతంత్రం అందించారన్నారు. వారి ఆశయాలను ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు.


అనంతరం “ఉప్పు సత్యాగ్రహం” (దండి మార్చ్) విగ్రహాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమీషనర్, వివిధ సంఘాల నాయకులు తదితరులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బివై.రామయ్య, పాణ్యం శాసన సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు శాసనసభ్యులు డా.జె.సుధాకర్, మున్సిపల్ కమీషనర్ భార్గవ్ తేజ, వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ బెల్లం మహేశ్వర రెడ్డి, బీసి కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్.గోపాల్ రెడ్డి, కార్పొరేటర్ సుదర్శన్ రెడ్డి, 46వ వార్డు కార్పొరేటర్ శ్రీనివాసరావు, 41వ వార్డు కార్పొరేటర్ శ్వేతారెడ్డి, 25వ వార్డు కార్పొరేటర్ సిట్రా సత్యనారాయణమ్మ, 17వ వార్డు కార్పొరేటర్ కైపా పద్మలత, 13వ వార్డు కార్పొరేటర్ జయలక్ష్మి, 6వ వార్డు కార్పొరేటర్ లినోఫర్, 7వ వార్డు కార్పొరేటర్ జుబేర్, 4వ వార్డు కార్పొరేటర్ అర్షియా పర్వీన్, అదనపు కమీషనర్ రామలింగేశ్వర్, రాంభూపాల్ చౌదరి ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు వై.రామేశ్వర్ రెడ్డి, వి.సుమంత్ చౌదరి, సెక్రెటరీ పి.ఈశ్వరయ్య, ఉపాధ్యక్షురాలు షేక్ పర్వీన్ జబీనా, నగరపాలక సంస్థ సిబ్బంది, వివిధ సంఘాల నాయకులు, మాంటిస్వరి చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News