తిరుమలలో(Tirumala) మళ్లీ చిరుత కలకలం రేపింది. రెండో ఘాట్ రోడ్డులో భక్తులకు చిరుతపులి కనిపించడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పెద్ద పెద్దగా కేకలు వేయడంతో అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. వెంటనే టీటీడీ(TTD) అధికారులకు సమాచారం అందించారు. అధికారులు హుటాహుటిన స్పాట్‌కి వెళ్లి చిరుత సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. కాగా ఇటీవల కాలంలో తిరుమలలో క్రూరమృగాల సంచారం ఎక్కువ అయింది. అలిపిరి నడకమార్గంతో పాటు ఘాట్ రోడ్డులోనూ చిరుతలు, పులులు, ఎలుగుబంట్లు ఎక్కువగా సంచరిస్తున్నాయి. దీంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.
Tirumala: తిరుమలలో మళ్లీ చిరుత కలకలం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES