గత కొన్ని నెలలుగా మంచు మనోజ్(Manchu Manoj) పేరు వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తండ్రి మోహన్ బాబు, సోదరుడు మంచు విష్ణుతో వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ఇదిలా ఉంటే సోమవారం రాత్రి భాకరపేట పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యారు. ఆయన ఉంటున్న గెస్ట్ హౌస్ తనిఖీకి వెళ్ళిన పోలీసులతో మనోజ్ గొడవ పడినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ ఘటనపై మనోజ్ వీడియో రిలీజ్ చేశాడు.
“కొన్ని నెలలుగా ఏం జరుగుతుందో మీ అందరికి తెలుసు. ఈ విషయంలో మిమ్మల్ని ఇబ్బందిపెట్టి ఉంటే మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే ఈ సమస్య నా ఒక్కరిదే కాదు. నా స్టూడెంట్స్ కావచ్చు.. లేదా మా కాలేజ్ ఎదురుగా ఉన్న ప్రజల కోసం కావచ్చు వారి కోసమే ఈ పోరాటం. నేను అందరి కోసం పోరాడుతుంటే నా మీదా అటాక్‌లు చేస్తూ.. తప్పుడు కేసులు పెడుతూ.. నా కుటుంబ సభ్యులను ఇందులోకి లాగుతూ.. ఒక మనిషిని ఎన్ని విధాలుగా నాశనం చేయాలో అన్ని చేస్తున్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఎక్కడ కూడా మిస్ బిహేవ్ చేయలేదు. చట్టానికి లోబడే పోలీసులకు సహకరించాను. ఇవన్ని చూసి నేను భయపడతాను అనుకుంటున్నారేమో.. అది ఈ జన్మలో జరగదు” అంటూ తెలిపారు.