Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Minister Narayana: టీడీపీ కార్యకర్తలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి నారాయణ

Minister Narayana: టీడీపీ కార్యకర్తలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి నారాయణ

Minister Narayana Said Good News To TDP Cader: నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలకు మంత్రి పొంగూరు నారాయణ శుభవార్త చెప్పారు. తన నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలను ఆదుకునేందుకు ఆయన ప్రత్యేక నిధి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యకర్తల నిబద్ధతను గుర్తిస్తూ, వారికోసం ప్రతి ఏడాది రూ.10 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, మంత్రి నారాయణ తన భార్య రమాదేవితో కలిసి 175 మంది కార్యకర్తలకు మొత్తం రూ.45 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. వచ్చే ఐదేళ్లలో కార్యకర్తల కోసం మొత్తం రూ.50 కోట్ల నిధిని ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. తన విజయం వెనక నిలిచిన కార్యకర్తల సేవలకు కృతజ్ఞతగా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఎప్పుడైనా కార్యకర్తలకు అవసరం ఉంటే 24 గంటలూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

- Advertisement -

అలాగే, నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేయడానికి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు నారాయణ తెలిపారు. నగరంలో రోడ్ల పనులు వేగంగా కొనసాగుతున్నాయని, వీధులను శుభ్రంగా ఉంచేందుకు స్వీపింగ్ యంత్రాలను వినియోగిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్‌కు 28 యంత్రాలు అందించినట్లు పేర్కొన్నారు. అదనంగా, నగరంలో 5 వేల మందికి ఇళ్ల పట్టాలను అందించడమే తన తదుపరి లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా పార్టీ కార్యకర్తలతో తన బంధాన్ని మరింత బలపర్చారు మంత్రి నారాయణ. నాయకత్వానికి కర్తవ్య భావనను కలిపి, సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టమైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad