నందవరం మండల కేంద్రంలో నిర్వహించిన జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకమే జగనన్న కార్యక్రమంలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ప్రజలే మా దేవుళ్ళు ప్రజల సంక్షమే మా ధ్యేయం అంటూ ఇంటింటికి తిరుగుతూ.. జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు సక్రమంగా ప్రజలకు అందుతున్నాయో లేదో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడిన చెన్నకేశవ రెడ్డి.. గత టిడిపి ప్రభుత్వంలో ప్రజలకి అందవలసిన సంక్షేమ పథకాలు, ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు అమలుపరచడంలో ప్రజలకు అర కొర అందించడమే కాకుండా జన్మభూమి కమిటీల పేరుతో దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసి అసలైన లబ్ధిదారులకు కాకుండా టిడిపి కార్యకర్తలకు, వారికి వారి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ప్రజలకు మాత్రమే అందించేవారని, ఇప్పుడు మన జగనన్న ప్రభుత్వంలో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పార్టీలకు, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందే విధంగా వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటుచేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా ప్రజల ఇంటి దగ్గరికి ప్రజా సంక్షేమ పథకాలు చేరేలా చేశారని ఈ సందర్భంగా ప్రజలకు గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు శివారెడ్డి గౌడ్, విరుపాక్షి రెడ్డి, కనకవీడు కేఆర్ లక్ష్మికాంత్ రెడ్డి తో పాటు జెసిఎస్ కన్వీనర్ చాంద్ భాషా, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, వలంటీర్లు, ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి గత టీడీపీ, ప్రస్తుత వైఎస్సార్సీపీ పాలనలోని తేడాలను ప్రజలకు వివరించారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ తోట సావిత్రి, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లు, జడ్పిటిసి నిఖిల్ చక్రవర్తి, నాయకులు, రమేష్ గౌడ్, యాల్ల గౌడ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.