నందికొట్కూర్ నియోజవర్గంలో 2024 కు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసిపి, టిడిపి, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలిచేందుకు శ్రమించారు. మంగళవారం 2024 జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ఫలితాల నేపథ్యం తీవ్ర ఉత్కంఠ నడుమ గెలుపొందే అభ్యర్థి ఎవరు అంటూ నియోజవర్గ ప్రజల్లో తీవ్ర చర్చ కొనసాగింది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రానికి వెలబడిన ఎన్నికల ఫలితాలలో ఓటింగ్ ప్రారంభమైన తొలి రౌండు నుంచే టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గిత్త జయసూర్య వైసిపి అభ్యర్థి డాక్టర్ సుధీర్ ధారపై ఆదిక్యత కొనసాగిస్తూ వచ్చారు. మొదటి నుండి 26 రౌండ్లో ప్రతి రౌండ్ లోను టిడిపి అభ్యర్థి గిత్త జయసూర్య తన ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చారు. ఎట్టకేలకు వెలుబడిన ఫలితాలలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య వైకాపా అభ్యర్థి డాక్టర్ సుదీర్ దార పై 9148 ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. నందికొట్కూర్ నియోజవర్గ రాజకీయాన్ని పరిశీలిస్తే టిడిపి పార్టీ ఎన్నికలలో గెలవక 20 సంవత్సరాలు అయినా నేపథ్యంలో ఎట్టకేలకు టిడిపి నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి నాయకత్వంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా గిత్త జయసూర్య తన సత్తా చాటి వైసిపి అడ్డగా మరిన నందికొట్కూరు నియోజకవర్గం పై టిడిపి జెండా తో జయకేతనం ఎగరవేయడంతో టిడిపి పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఆనందోత్సవంతో సంబరాలు చేసుకున్నారు.
నియోజవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు :మాండ్ర శివానందరెడ్డి.
నందికొట్కూరు నియోజవర్గంలో 2024 కు జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాలలో టిడిపి పార్టీని ఆదరించి గిత్త జయ సూర్యను గెలిపించినందుకు, గెలుపునకు కృచేసిన పార్టీ కార్యకర్తలకు నాయకులకు టిడిపి నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ముందుగా ఎన్నికల ఫలితాలలో టిడిపి అభ్యర్థి గిత్త జయసూర్య గెలుపొందడంతో అల్లూరు గ్రామంలోని తన స్వగృహంలో తరలివచ్చిన టిడిపి కార్యకర్తలతో కలిసి మాండ్ర శివానందరెడ్డి దంపతులు సంబరాలు చేసుకున్నారు.
పట్టణంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య గెలుపొందడంతో అభిమానులు మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల రబ్బాని, కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ తమ అనుచరులతో కేజీ రహదారిపై బాణసంచా పేలుస్తూ, స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుల లింగాల స్వాములు ఆధ్వర్యంలో నందికొట్కూరు నియోజవర్గ ఎమ్మెల్యేగా గిత్త జయసూర్య గెలవడంపై పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గిత్త జయ సూర్య జిందాబాద్ సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు అంటూ వారు కృతజ్ఞతలు తెలియజేశారు.