Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Prakash raj: ఛీఛీ పవన్ కళ్యాణ్‌.. ప్రకాశ్ రాజ్ ఘాటు విమర్శలు

Prakash raj: ఛీఛీ పవన్ కళ్యాణ్‌.. ప్రకాశ్ రాజ్ ఘాటు విమర్శలు

Prakash raj- Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌, సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. పవన్.. బీజేపీతో చేతులు కలపడం నచ్చని ప్రకాశ్ రాజ్ సందర్భం చిక్కినప్పుడల్లా పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉంటారు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో పవన్‌ను విమర్శిస్తూ పోస్టులు పెడతారు. తాజాగా మరోసారి పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా విమర్శలు చేశారు. ఛీ ఛీ అంటూ రెచ్చిపోయారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన రాజ్యభాష విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో పవన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందీ భాషను పొగిడారు. మాతృ భాష అమ్మ అయితే..హిందీ భాష పెద్దమ్మ అని తెలిపారు. హిందీ నేర్చుకోవడం అంటే ఉనికిని కోల్పోయినట్లు కాదని స్పష్టం చేశారు. మరో భాషను అంగీకరించడం అంటే ఓడిపోవడం కాదని కలిసి ప్రయాణం చేయడమని వెల్లడించారు. ప్రస్తుతం విద్య, ఉద్యోగం, వ్యాపారం కోసం భాషతో సంబంధం లేకుండా ముందుకెళ్తున్నారని తెలిపారు. ఇలాంటి తరుణంలో హిందీ భాషను వ్యతిరేకంచడం అంటే భవిష్యత్తు తరాల అభివృద్ధిని అడ్డుకున్నట్లే అవుతుందని పేర్కొన్నారు.

హిందీలో డబ్ అయిన సౌత్ ఇండియన్ సినిమాలు 31 శాతం ఆదాయం తెచ్చిపెడుతున్నాయని గుర్తు చేశారు. వ్యాపారానికి హిందీ భాష అవసరం అయినప్పుడు నేర్చుకోవడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారిన ప్రశ్నించారు. ఎక్కడో పుట్టిన ఆంగ్ల భాషను సొంతం చేసుకున్న మనం ఇక్కడే పుట్టిన హిందీని ఎందుకు మన భాషగా అనుకోవడం లేదని నిలదీశారు. హిందీ నేర్చుకోవాలని ఎవరినీ బలవంతం చేయడం లేదు అని వెల్లడించారు.

Also Read: పవన్ ఛాలెంజ్‌కు లోకేశ్ సై.. ఒక్కొక్కటి కాదు ఏకంగా కోటి!!

కొందరు రాజకీయాల కోసం హిందీని వ్యతిరేకిస్తారన్నారు. హిందీ భాష దేశాన్ని ఐక్యంగా ఉంచుతుందని.. అందుకు తాను హిందీ భాషను స్వాగతిస్తానని స్పష్టం చేశారు. తాజాగా పవన్ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఈ రేంజ్‌కి అమ్ముకోవడమా ఛీ ఛీ… జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ హిందీ భాష గురించి మాట్లాడిన వీడియోను షేర్ చేశారు.

అయితే ప్రకాష్ రాజ్ ట్వీట్‌కు జనసైనికులు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. మిగిలిన భాషలను ద్వేషిస్తే ప్రకాశ్ రాజ్ ఇన్ని భాషల్లో సినిమాలు చేసేవారా అంటూ ప్రశ్నిస్తున్నారు. జాతీయ స్థాయిలో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నావంటే అన్ని భాషల్లో నటించబట్టే కదా అని నిలదీస్తున్నారు. మొత్తానికి ప్రకాశ్ రాజ్.. పవన్ కళ్యాణ్‌ను తరుచూ టార్గెట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad