జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాటతీరు మార్చుకొని వాలంటీర్లకు క్షమాపణల చెప్పాలని పత్తికొండ శాసనసభ్యులు కంగాటి శ్రీదేవమ్మ అన్నారు. వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న వాలంటీర్ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ కు మతి భ్రమించిందని ఎమ్మెల్యే మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వార్డు మెంబర్ కూడా గెలవలేని వ్యక్తి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు గురించి మాట్లాడడం చూస్తే హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే ఘాటుగా విమర్శించారు. ఎపిలో ప్రభుత్వ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజలకు సంక్షేమ పథకాలు చేరవేస్తున్నారని.. ప్రతిపక్ష పార్టీల నేతలకు మింగుడు పడడం లేదని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలకు కులమతాలకు అతీతంగా పనిచేస్తున్న వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కరోనా సమయంలో గ్రామ వార్డు వాలంటీర్లు మన రాష్ట్రంలో ఎంతో సేవలు చేశారని అలాంటి వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని గ్రామ వార్డు వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె అన్నారు. కరోనా సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు అలాంటి సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి వాలంటీర్లు ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడారని ఆమె అన్నారు. గ్రామ వార్డు వాలంటీర్లు ఉచిత సేవలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అది గుర్తుంచుకోవాలని పవన్ కళ్యాణ్ కు సూటిగా సమాధానం చెప్పారు. 2024 లో వైసిపి మళ్లీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడని ఆమె జోష్యం చెప్పారు. వైసిపి పార్టీపై ప్రజలలో పెరుగుతున్న ఆదరణను చూసి ప్రతిపక్ష పార్టీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నారాయణదాసు, వైసిపి నాయకులు శ్రీ రంగడు, మండల కన్వీనర్ కారం నాగరాజు, సోమశేఖర్ చక్రాల సర్పంచ్ శ్రీరాములు, పల్లె ప్రతాపరెడ్డి, వైసిపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
Sreedevamma: పవన్ కళ్యాణ్ మాటతీరు మార్చు కోవాలి
రెండోసారి సీఎంగా జగన్ గెలుస్తారు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES